05/14/15 1:26 PM

‘వొలానో’లో ఉపాసన ఇన్వెస్ట్‌మెంట్‌ – బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెర్రీ

RamCharan-as-Volano-Brand-Ambassador

సినిమా రంగంతో పాటు బిజినెస్‌ రంగంలోను మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు విమానయాన రంగంలో ఇటీవలే రాంచరణ్ అడుగులు వేశారు. ‘టర్బో మేఘా రీజనల్‌ ఎయిర్‌వేస్‌’ సంస్థలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉంటూనే, బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ‘మగధీరుడి’ విమానాలు జూన్‌ నుంచి తమ సర్వీసును ప్రారంభించనున్నాయి. ఇదిలావుంటే, చరణ్‌ తాజాగా మరో బిజినెస్‌లోనూ తన లక్‌ పరీక్షించుకుంటున్నారు.

 

RamCharan-as-Volano-Brand-Ambassador

 

అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ కంపెనీ ‘వొలానో’ ఎంటర్‌టైన్‌మెంట్‌లో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ ‘లైఫ్‌టైమ్‌ వెల్‌నెస్‌ ఆర్‌ఎక్స్‌ ఇంటర్నేషనల్‌’ పెట్టుబడులు పెట్టింది. ‘లైఫ్‌టైమ్‌ వెల్‌నెస్‌’కు చెర్రీ సతీమణి ఉపాసన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ నేపధ్యంలో ‘వొలానో ఎంటర్‌టైన్‌మెంట్‌’కు చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. స్పోర్ట్స్‌, ఫిట్‌నెస్‌ ఇష్టపడే వారికి ఇది వొలనో ఎంటర్‌టైనమెంట్‌ ఒక  సరికొత్త వేదికగా నిలుస్తుందని చరణ్‌ ఈ సందర్భంగా తెలిపారు. వ్యక్తిగతంగా తాను కూడా ఇలాంటి క్రీడలనే ఇష్టపడతానని స్పష్టం చేశారు. ‘ద డెవిల్స్‌ సర్క్యూట్‌’ పేరుతో వొలానో ఈ స్పోర్ట్స్‌ నిర్వహిస్తోంది. దీనికి విదేశీయులు, కార్పోరేట్‌ ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

 

మరోవైపు తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాకి  చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

Click Here to Read this post in English

Tags : appolo hospitalsbisiness mindedbrand ambassadorlife time wellnessmega power starram charantha devil circuitupasana investmentvolano

Also read

Use Facebook to Comment on this Post



Menu