05/14/15 4:07 PM

బాలకృష్ణ లయన్ – సినిమా రివ్యూ

Lion Movie Review

Lion Movie Review

 

బాలకృష్ణ సినిమా అనగానే ఫాన్స్ కి కొన్ని అంచనాలు ఉంటాయి, బాలకృష్ణ పై జోకులు వేసుకునే వారికి కూడా కొన్ని అంచనాలు ఉంటాయి. దర్శకుడు సత్యదేవా మొదటి వారి అంచనాలని నిలబెట్టాడు, రెండోవారు షాక్ అయ్యేలా చేశాడు. కథని నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రి కి ఓ మంచి మాస్ డైరెక్టర్ ని అందించాడు.

 

కథ

సినిమా ఒక హాస్పిటల్ లో మొదలవుతుంది. 18 నెలల నుండి కోమా లో ఉన్న ఓ వ్యక్తి (బాలకృష్ణ) కోమా నుండి బయటకు వస్తాడు. ఆ వ్యక్తి తన పేరు బోస్ అని అనుకుంటాడు. కాని చుట్టుపక్కల ఉన్న వారు తన పేరు గాడ్సే అని ఓ పెద్ద కంపెనీ సి.ఇ.ఓ. అని చెప్తారు. ఆ వ్యక్తి మాత్రం తాను బోస్ నే అని బలంగా నమ్ముతుంటాడు. తాను తన తల్లితండ్రులు అనుకున్న వాళ్ళు, తన ప్రేయసి అనుకున్న మహాలక్ష్మి (త్రిష) ఎవరూ తనని గుర్తుపట్టరు. మరోపక్క జయసుధ, చంద్రమోహన్ ల జంట మేమే నీ తల్లితండ్రులం, ఈమె నీ భార్య (రాధికా ఆప్టే) అని వెంటబడుతుంటారు. ఆఖరికి డీఎన్ఏ పరీక్ష ద్వారా జయసుధ, చంద్రమోహన్ (సినిమాలో ఈ పాత్రలకి పేర్లు ఉన్నట్లు గుర్తులేదు) లే తన తల్లిదండ్రులని తేల్చిచెప్తారు. తన పేరు గాడ్సే అని కన్ఫర్మ్ చేస్తారు. అప్పటికీ తాను బోస్ నే అని, సిబిఐ ఆఫీసర్ని అనే నమ్ముతున్నా, సాక్షాలు బలంగా ఉండటం తో తాను గాడ్సే నే అని ఫిక్స్ అయి, తన కుటుంబం కలిసి ముంబై బయల్దేరతాడు. అక్కడే స్టోరీ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు సత్యదేవా. ఇతను గాడ్సే అయితే, బోస్ ఎవరు? సిబిఐ ఆఫీసర్ బోస్ కి గాడ్సే కి సంబంధం ఏమిటి? అసలు గాడ్సే ఆస్పత్రిలో ఎందుకున్నాడు? ఇలాంటి విషయాలు అన్నీ తెరమీద చూడడమే బెటర్, ఎందుకంటే.. స్టోరీ ముందే చెప్పేసి మీ థ్రిల్ పోగొట్టడం కరెక్ట్ కాదు.

 

కథనం

సత్యదేవా మంచి కథని రాసుకోవడమే కాదు, దాన్ని ఎక్కడా పట్టుసడలకుండా, బోర్ కొట్టకుండా ప్రేక్షకులకి చెప్పగలిగాడు. ఫస్ట్ హాఫ్ లో అయితే అదరగొట్టాడు, సెకండ్ హాఫ్ లో కథనం లో వేగం తగ్గకుండా ఫాన్స్ నిరాశ పడకుండా బాగా మానేజ్ చేసాడు.

 

నటన

సిబిఐ ఆఫీసర్ గా బాలకృష్ణ ని తన ఫ్యాన్స్ కే కాదు అందరికీ నచ్చేలా నటించాడు. క్యారెక్టర్ లోనే స్ట్రగుల్ ఉండడం తో బాలకృష్ణ ముఖం లో కనిపించే వయసు మీదకు ప్రేక్షకుల దృష్టి వెళ్ళదు. బాలకృష్ణ ఏజ్ కి దగ్గరగా ఉండేలా క్యారక్టర్ కావడం తో బాలకృష్ణ ఫర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అక్కడక్కడా వచ్చే రొమాన్స్ సీన్స్ లో మాత్రం బాలకృష్ణ తన విమర్శకులకి మళ్ళీ చాన్స్ ఇచ్చాడు. రోమాన్స్ సీన్స్ తప్ప మిగిలిన అన్ని సీన్స్ లో బాలయ్య మంచి మార్కులే కొట్టేస్తాడు. గాడ్సే, బోస్ క్యారెక్టర్ ల మధ్య నలిగిపోతూ బాలకృష్ణ చేసిన యాక్టింగ్ కూడా బాగుంది. మిగిలిన ఆర్టిస్ట్ లు గురించి చెప్పాలంటే.. త్రిష, రాధికా పాటలకే పరిమితం, ప్రకాష్ రాజ్ కు ఇలాంటి క్యారెక్టర్ కొట్టినపిండే. మిగిలిన ఎవరికీ నటించడానికి పెద్దగా స్కోప్ లేదు.

 

దర్శకత్వం

ఫస్ట్ సినిమా తోనే సత్యదేవా మంచిమార్కులు కొట్టేసాడు. బాలయ్య ఫాన్స్ ని సంతృప్తి పరుస్తూనే, మిగిలిన అందరికీ నచ్చేలా సినిమా తియ్యడం చాలా కష్టం. సత్యదేవా కష్టం ఫలితాన్నిచ్చింది. మరిన్ని సినిమాలకి అవకాశం రావడం పక్కా.

 

సాంకేతిక వర్గం:

నిర్మాత రుద్రపాటి రమణరావు  ఖర్చు విషయం లో రాజీ పడకుండా,అలాగని హద్దులు దాటకుండా అందరికీ లాభాలు వచ్చే బడ్జెట్ లోనే సినిమాని నిర్మించారు.  ఇక మణిశర్మ మ్యూజిక్ బాగుంది. మూడు పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. రామ్ లక్ష్మణ్ స్టంట్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. సెన్సార్ అప్రూవ్ చేసిన లెంగ్త్ కన్నా పదినిమిషాలు కోసేసి మంచిపనిచేసారు. ఇంకా ఓ పదినిమిషాలు తగ్గించే అవకాశం ఉన్నా ఎడిటర్ ఆ పని చేయలేదు.

 

మైనస్ పాయింట్స్

త్రిష తో లవ్ ట్రాక్, రాధికా ఆప్టే తో రొమాన్స్ రెండూ పండలేదు. త్రిష, రాధికాలతో కలిపి తీసిన పాట కూడా బాగాలేదు. ఆ పాటకి ముందు క్రియేట్ చేసిన సీన్ కూడా సినిమా ఫ్లో కి అడ్డంగా ఉంది. ఫైట్స్ లెంగ్త్ ఎక్కువయ్యాయి. కామెడి తక్కువగా ఉంది.

 

ఒక్క మాటలో చెప్పాలంటే

బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగ, మిగిలిన వారు ఒకసారి చూడొచ్చు.

 

ఈ సినిమా ECG రిపోర్ట్ ఒక సారి చూద్దాం. ECG విధానం లో, ప్రతి అయిదు నిమిషాలకి సినిమా ఎలా ఉంది, ఎక్కడ డల్ అయింది, ఎక్కడ అదిరిపోయింది అనే దాన్ని బట్టి 0-5 రేటింగ్ ఇస్తాము. ఇలా ప్రతి 5 నిమిషాలకి రేటింగ్ ఇస్తే ‘లయన్’ సినిమా గ్రాఫ్ ఇలా ఉంది.

 

Lion movie review ECG report

 

అంకెల్లో: 3***


 

Click Here to Read this Review in ENGLISH

Tags : #lionreview#radhikaaptebalakrishnabalakrishna lionBalakrishna Lion MovieBalakrishna lion movie reviewbalakrishna movie lionbalaKrishna trisha movie lionlionlion audiolion benefit show at bramaramba theatrelion director satyadevalion filmlion movielion movie producer\lion movie songslion musiclion ratingslion reviewlion review ratingslion storymanisharma music for lionnandamuri balakrishnanbk liontrisha

Also read

Use Facebook to Comment on this PostMenu