04/9/15 2:01 PM

ధర్మవరం పట్టు.. ‘పద్మ వర్షిణి’ చీర రంగులు మారుస్తుంది

saree

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టుచీరలకు దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ఇక్కడ పట్టు వస్త్రాల గురించి చెప్పనవసరం లేదు. రకరకాల డిజైన్లు, వెరైటీలు సృష్టించడం ఇక్కడి నేతన్నల కళాతృష్ణకి, నైపుణ్యానికి నిదర్శనం. ఇక పట్టుచీరల డిజైనింగ్‌లో సిద్ధహస్తుడైన పెద్దయ్యగారి మోహన్‌ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించాడు. తన కళా నైపుణ్యంతో ఎన్నో రకాల పట్టుచీరలను డిజైన్‌ చేసి ప్రశంసలందుకున్న ఆయన.. తాజాగా రంగులు మార్చే పట్టుచీరను రూపొందించి ఆశ్చర్యానికి గురి చేశాడు. ధర్మవరం పట్టుచీరపై రత్నాలు, ముత్యాలు పొదిగిన పద్మ పుష్పాలను మేళవించి ‘పద్మ వర్షిణి’ అనే డిజైనర్‌ వేర్‌ శారీని తయారు చేశాడు.

 

saree

 

‘పద్మ వర్షిణి’ ప్రత్యేకతలు:

ఈ పట్టుచీర తయారీకి 180 గ్రాముల రేషం ఉపయోగించారు.

మేలిమి ముత్యాలు, 45 రకాలైన రత్నాలను వినియోగించారు.

పట్టుదారంతో పద్మ పుష్పాలను డిజైన్‌ చేశారు.

కొంగులో రత్నాల కూజాభాండం, సప్త పుష్పాల అమర్చారు.

చామంతి పుష్పాకారాన్ని మేళవించిన మహిళ హస్తాల అల్లారు.

కుచ్చిళ్ళలో ఆరు తులాల మేలిమి ముత్యాలతో మంగళ తోరణాల కూర్చారు.

వీటన్నింటి మేళవింపుతో వాతావరణాన్ని బట్టి వర్ణాలు మారే స్వభావం ఈ చీరకి ఉంటుంది.

ఈ చీరపై కాంతి అధికంగా పడినప్పుడు ఒక రంగు, తక్కువగా పడినప్పుడు మరో రంగులో మెరుస్తుంది. గులాబీ, నీలి, పచ్చ రంగులను ఈ చీర దాలుస్తుంది.

 

పద్మారవింద హ్యాండ్‌లూమ్స్ అధినేత బీరే ప్రసాద్‌ సహకారంతో మోహన్‌ ఈ చీరను తయారుచేశాడు. 10 మంది కార్మికులు 3 నెలలు శ్రమిస్తే ఈ అద్భుత సృజన ఆవిష్కృతమైంది. ఈ చీరను బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ చీర తయారీకి రూ.33 వేలు ఖర్చయింది. మార్కెట్‌లో ఈ వర్ణ రంజితమైన ‘పద్మ వర్షిణి’ పట్టుచీర ఖరీదు రూ. 38 వేలు మాత్రమే.

 

Tags : ananthapuramcost Rs.38 thousands onlydesigner specialist mohandharmavarampadma varshini new trendpattu sareespearls

Also read

Use Facebook to Comment on this Post



Menu