05/14/15 6:40 PM

టీనేజ్‌ గర్ల్ ప్రాణం తీసిన ‘సెల్ఫీ’ మోజు

Anna Ursu

సెల్ఫీలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో యువత సెల్ఫీల కోసం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేయబోయి ఓ టీనేజ్‌ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర రుమేనియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…

 

Anna Ursu

Anna Ursu died while attempting to take a selfie

 

లాసీ నగరంలో నివాసం ఉంటున్న అన్నా ఉర్సు అనే 18 ఏళ్ళ యువతి సెల్ఫీ తీసుకుని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయాలనుకుంది. అందరిలా కామన్‌గా తీసుకుంటే థ్రిల్‌ ఉండదనుకుందో ఏమో.. పెద్ద సాహసానికి పూనుకుంది. అనుకుందే తడవుగా సమీపంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ట్రైన్‌ పైకి ఎక్కి స్పెషల్‌ సెల్ఫీ తీసుకోవాలని ట్రై చేసింది. ఈ క్రమంలో ఆమె కాలు హై ఓల్డేట్‌ కరెంట్‌ వైర్లకు తగలడంతో షాక్‌కు గురైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను ప్రయాణీకులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అన్నా ఉర్సు మృతిచెందింది.

 

Teeneger died taking selfie

© Anna Uru, Facebook

 

Click here to read this post in English

Tags : anna ursuface bookhigh voltage current wiresnortheast rumeniaRailway stationselfiSHOCKteenage girl diedtrain

Also read

Use Facebook to Comment on this Post



Menu